Jogu Ramanna Harithaharam : మేడి గూడ లో జోగు రామన్న

Political

views 45

Jul 9th,2021

ATM : ఎమ్మెల్యే జోగు రామన్న పల్లె ప్రగతిలో భాగంగా ఆదిలాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే జైనాథ్ మండలం మేడి గూడ లో అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. సాత్నాల ప్రాజెక్టు వద్ద 90 లక్షల 35 వేలతో చేపట్టే ప్రాజెక్టు మరమ్మతు పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించిన తర్వాత  హరితహారంలో బాగంగా అధికారులతో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రామన్న మాట్లాడుతూ సాత్నాల ప్రాజెక్టు నీటి చుక్క కూడా వృధా పోకుండా అవసరమైనన్ని చెక్ డ్యామ్ లు కట్టడానికి నిర్ణయించామని దీంతో రైతులు సాగు చేసుకుంటున్న ప్రతి భూమికి సాగునీరు అందే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు రైతులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూలైన్లో నిలబడడంతో పాటు పంటను అమ్ముకోవడానికి సైతం ఇబ్బందులు పడేవారన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...