సూపర్ స్టార్ రజినీ కాంత్ రూ.50 లక్షలు భారీ విరాళం... అదే దారిలో విజయ్ సేతుపతి, సూర్య, కార్తి

కరోనా వైరస్ ప్రభావంతో వణికిపోతున్న విషయం అందరికి తెలిసిందే.వైరస్ ప్రభావంతో సిని ఇండస్ట్రీ మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసేందే.షూటింగులు నిలిపివేయడంతో సామాన్య సినిమా కార్మికులంతా రోడ్డుపై పడే పరిస్థితి వచ్చి పనులు లేక డబ్బులు చాలక వారంతా అనేక కష్టాలు పడుతున్నారు.తాజాగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘానికి సూపర్ స్టార్ రజినీ కాంత్ రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.అలాగే కోలివుడ్ చెందిన మరో హీరో మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా తన వంతు సాయంగా రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించాడు.సినీ ప్రముఖులంతా కలిపి తమ వంతు సాయం అందించాలని కోరారు.హీరో సూర్య, కార్తి వారి తండ్రి శివకుమార్ కలిసి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు..
Comments
Post Your Comment
Public Comments: