Varahi Devi : వారాహీ నవరాత్రులు మరియు విశిష్టత

Devotional

views 30

Jul 9th,2021

ఆషాడ మాసం ప్రారంభ కాలంలో వచ్చే నవరాత్రులను  "శ్రీ వారాహీ నవరాత్రులు" అని పిలుస్తారు. శ్రీ లలితా దేవి యొక్క దండనాయిక (సేనానాయిక) శ్రీ వారాహీ మాత ఈమె రక్షణ శక్తి. ఎంతటి ఘోర కష్టాల్లో ఉన్నవారైనను ఈ తల్లిని స్మరించినంత మాత్రాన ఉద్దరింపబడతారని శాస్త్ర వచనం

వారాహి మాత:

ఆషాడ నవరాత్రులు ఆ తల్లి అనుగ్రహం పూజించాలి, భూ దేవి మరో రూపం, వరాహ స్వామి యొక్క స్త్రీ రూపం, లలితా దేవి యొక్క దండిని రూపం వారాహి మాత, ఈమె అన్యాయాన్ని ఎదిరించే శిక్షించే దేవత, రక్షణ గలిగించే దేవత, ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేది కలగనీయదు, శత్రు సంహారం , అలాగే రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది, పాడిపంటలు, నీటిని అనుగ్రహిస్తుంది. ఈ తల్లి మంత్రం సిద్దిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది.

వారాహి దేవత:

వారాహి దేవత వరాహావతారం యజ్ఞ స్వరూపం, దశ మహా విద్యలలో లేదు. ఆమె మాతృకా దేవత. బగలా ముఖి స్తంభన శక్తి. వారాహి యోగ సిద్ధికరి. సముద్రపు లోతులలో దాచి పెట్ట బడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం. అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మ తత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య. అతి బలవత్తరమైన శక్తి. సమస్యలను కూకటి వేళ్ళతో పెకలించి పారేయగలదు.

రాత్రివేళల్లో పూజలందుకునే వారాహి దేవత:

మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహినీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది. దుష్టశిక్షణ కోసమూ, భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరైన వారాహి విశేషాలు..వరాహుని స్త్రీతత్వం.

పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది.

రూపం:

వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీరఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో... శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది.

ఆరాధన:

తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజించడం కద్దు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి (ఒడిశా), వారణాసి, మైలాపుర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ.

సైన్యాధ్యక్షురాలు:

లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ... తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం.

వారాహిదేవి:

వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతి,దండనాధ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం,చక్రం,నాగలి,గునపం,అభయ వరదాలతో  దర్శనమిస్తుంది. 

బ్రాహ్మి,మాహేశ్వరి, కౌమారి,వైష్ణవి, వారాహి. ఇంద్రాణీ,చాముండి, వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు.

శాక్తేయులు వారాహీ దేవి పార్వతీ దేవి మాతృక అని నమ్ముతారు . ఈ మాతృకలు దానవులపై యుధ్దానికి వెళ్లే టప్పుడు అవసరానుగుణంగా దేవతలయొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమతమ ఆయుధాలను యిచ్చినవి . శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకొని శంభుని సంహరించెనని శక్తి పురాణం లో ఉంది.

దేవీ భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజున సంహరించేటపుడు వారాహీ మాతృకను సృష్టించెనట . దేవీ పురాణం లో వారాహి దేవిని వరహాజనని , క్రితంత తనుసంభవ ( మృత్యుసమయములో వచ్చేశక్తి అంటే యమశక్తి) గా కూడా వర్ణించేరు  . వారాహి దేవి వాహనం యెనుము , పాశం ధరించి వుండడం కూడా పై వాదనను బలపరుస్తుంది . ఈమెను కైవల్యరూపిణి , వైవస్వతి అని కూడా అంటారు . ఈమెను వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు .వారాహి దేవి వరాహ ముఖం అనగా పంది ముఖం  కలిగి , చక్రం , కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది . 

లలితాసహస్రనామాలలో ఈ వారాహి దేవి నామం వుండడం కనిపిస్తుంది. వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా, తాంత్రిక పూజ  జరగపడం సర్వసాధారణం.  వారాహి దేవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తి అవుతాయి.

వారాహి దేవి:

ఈమె  సప్త మాతృకలలో  ఒకామె అమ్మవారి  శక్తి  స్వరూపాలలో  ఒకటిగా   కొలుచుకుంటాము   ..  

వరాహస్వామి  అర్ధాంగి   ..  

శ్రీమహాలక్ష్మి  స్వరూపం   ..  

నేపాలీయులు   ఈమెనే  బారాహి  అనే  నామధేయం తో   కొలుచుకుంటారు   ..  

బౌద్ధ మతం వారు   వజ్ర వారాహి ..   

మరీచిగా ఈమెనే  పూజిస్తారు   .. 

 బ్రాహ్మీ     ..  మహేశ్వరీ   ..   కౌమారీ   ..  వైష్ణవి   ..  వారాహి  ..  ఇంద్రాణి  ..   చాముండీ    ..  

సప్త మాతృకలు .

మార్కండేయ పురాణంలో  దేవీమహత్యం  లో   ..  

శుంభ  నిశుంభ   వధ  కధ  ప్రకారం  ..  

దేవుళ్ళ  శరీరాల  నుంచి   వారి  స్త్రీ  రూప   శక్తులు   బయటకు  వస్తాయి  ..

శివుని  నుంచి     శివానీ   ..   

విష్ణువు నుంచి   వైష్ణవి....

బ్రహ్మ నుంచి   బ్రాహ్మణీ  ..  

వరాహస్వామి  నుంచి  వారాహీ   ఉధ్భవించారు    ..

 ఈమె   ఉత్తర దిక్కుకు  అధిదేవత   ..  

ఈమె   చేతిలో   నాగలి   రోకలి  ఉంటుంది   .. 

 నాగలి  భూమిని  దున్ని  సేధ్యానికి   సంకేతం   ..  

 రోకలి   పండిన  ధాన్యాన్ని  దంచి  మనకు  ఆహారంగా   మారడానికి   సంకేతం   ..  

ఇది   బాహ్యార్ధం  ..అంతరార్థం   ఏమిటంటే:

అహంకార  స్వరూప  దండనాధ  సంసేవితే 

బుద్ధి   స్వరూప  మంత్రిణ్యు   పసేవితే .

ప్రతీ  మనిషిలోనూ    వారాహీ శక్తి    నాభి ప్రాంతంలో  ఉంటుంది.

మణిపూర   ..  

స్వాధిష్టాన   .. 

మూలాధార చక్రాలను   ప్రభావితం  చేస్తుంది   ..  కుండలినీ శక్తిని  జాగృతం   చేస్తుంది  ..  

మనలో  అస్తవ్యస్తంగా  ఉన్న    పృధ్వీ  అనే   బుధ్ధినీ    ..  రక్తబీజుడులాంటి   పిచ్చి  మొక్కలతో    అక్కరలేని   మనలో  వరసగా   ఉధ్భవించే  ఆలోచనలను  ..    లలితామాత   సైన్యాధ్యక్షురాలైన   దండనాయకి    శక్తి  అనే    నాగలితో  దున్నుతూఉంటే ..  తన  సైన్యం  అయినటువంటి .. రధ   గజ  తురగ   పదాతి    దళాల  సహాయంతో    మనలో  ఉన్న   మానసిక  వికారాలను   అన్నింటినీ    నాశనం  చేసి  ..  జ్ఞానమనే   సేద్యానికి   అంకురార్పణ   చేసి    .. ధాన్యం  అనే   కుండలినీ  శక్తిని   పెంపొందించి .. రోకలితో   ధాన్యం  నుండి    బియ్యాన్ని  వేరు చేసి   మన  ఆకలికిఅన్నమైనట్లుగా అలాగే  మన  జన్మాంతరాలలో    చేసిన  కర్మఫలాలను ( ధాన్యపు పొట్టు నుంచి బియ్యాన్ని  వేరు చేసి నట్టు) వేరుచేసి   మోక్షజ్ఞానాన్ని   క్షుధ్భాధ  తీర్చే   బియ్యంలా  మనకు   అందచేస్తుంది   .. వారాహి    ..  అనగా  భూదేవి   శ్రీమహాలక్ష్మి  ..వారాహీదేవి   కైవల్యరూపిణి   ..  వైవస్వతి   అని  కూడా అంటారు  ..   అసలు  ఇప్పుడు  మనకు  జరిగే  కల్పం   పేరే   ..  శ్వేత వరాహ కల్పం    ఆయన  దేవేరే  ఈఈ   వారాహీ    ..

                               ఇఛ్ఛా శక్తి  లలిత

                               జ్ఞానశక్తి  శ్యామల 

                               క్రియా శక్తి  వారాహి

కేవలం   రాత్రి  వేళల్లో  మాత్రమే  పూజలందుకునే  ఏకైక    వారాహీ  స్వరూపం లో  ఉన్న    లక్ష్మిదేవి   .. 

     *  ఆయు   రక్షతు  వారాహి    *    

 

ప్రాణ సంరక్షిణి:

వసంత నవరాత్రులు    గణపతి నవరాత్రులుశరన్నవరాత్రులే కాక వారాహీ నవరాత్రులు కూడా మన సనాతన ధర్మంలో శాక్తేయులూ  శైవులూ  వైష్ణవులూ కూడా ఆషాఢ పాడ్యమి నుంచి ఈ వారాహీ నవరాత్రులలో వారాహీ దేవిని కొలుస్తుంటారు. భక్తుల కష్ట  నష్టాలతో పోరాడే  యోధురాలు .. ఈమెను   ఆరాధిస్తే   శతృ భయం  ఉండదు 

జ్ఞానప్రదాయని:

ధాన్యలక్ష్మీ   స్వరూపమైన   వారాహీని   ఆరాధన   చేసి    దేశం  సుభిక్షంగా  ఉండాలనీ    మనం  అంతా   చల్లగా  ఉండాలనీ   అమ్మ   వారాహీని   పాదాలు  పట్టి   ప్రార్ధన  చేద్దాం   .. 

వారణాసీ  క్షేత్ర పాలిక  ..   ఈ  వారాహీ   ..  

రాత్రి  11   గంటలనుంచి  దర్శనం  ప్రారంభం  అవుతుంది.తెల్లవారుజామున 4  గంటలకు వారాహదేవాలయం మూసి వేస్తారు. కేవలం రాత్రి  వేళల్లో  మాత్రమే వారాహీ దర్శనం రాత్రి 11 గంటల నుంచి  తెల్లవారుజామున 4  వరకు ...

వారాహి దేవి నామాలు:

ఈ నామాలు రోజు తలుచుకుని నమస్కారం చేసిన ఆ తల్లి ఆశీర్వాదం దక్కుతుంది. 

పంచమి, దండనాథా, సంకేతా, సమయేశ్వరి, సమయ సంకేతా, వారాహి, పోత్రిణి , వార్తాళి ,శివా,ఆజ్ఞా చక్రేశ్వరి ,అరిఘ్ని.

"ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా

ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ....."

లడ్డు ఆకారంలో ఉండే గుండ్రటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. నీలిరంగు పుష్పాలు తో పూజించడం, రేవతి నక్షత్రం రోజు విశేష పూజ కు అనుగ్రహిస్తుంది. ఈమె వాహనం దున్నపోతు,ఉగ్రంగా కనిపించిన ఏమీ చల్లని తల్లి, అన్యాయంగా దౌర్జన్యం గా ఆక్రమణకు గురి కాకుండా దేశాన్ని కానీ కుటుంబాన్ని కానీ, పొలాన్ని కానీ రక్షించే దేవతగా తరాలుగా ఉపాసించ బడుతుంది.లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వరాహీ దేవి. లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది, దానిపేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు ఉంటారు. 

 

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |

జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |

నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||

భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |

మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |

 

విశుక్రుడిని ఈ తల్లి సంహరించింది, ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు. లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని లక్ష్మిని కీర్తిస్తారు అంటే ఈమె లక్ష్మీ స్వరూపం. వారాహీ పూజనూ సూర్యోదయానికి ముందు.. సూర్యాస్తమయానికి తరువాత చేయాలి.ఈమె   ఉత్తర దిక్కుకు  అధిదేవత . ఈమె చేతిలో నాగలి రోకలి  ఉంటుంది నాగలి భూమిని దున్ని సేధ్యానికి సంకేతం . రోకలి   పండిన  ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా   మారడానికి   సంకేతం .ఇఛ్ఛా శక్తి లలిత, జ్ఞానశక్తి శ్యామల , క్రియా శక్తి  వారాహి, కేవలం రాత్రి వేళల్లో మాత్రమే పూజలందుకునే  ఏకైక వారాహీ స్వరూపం లో ఉన్న  లక్ష్మిదేవి రూపం తాంత్రిక పూజలు చేసి ప్రసన్నం చేసుకుంటారు, వారాహి దేవిని శ్రీ విద్యా సంప్రదాయం లో చేసే విధానం కూడా ఉంటుంది అయితే అది శ్రీవిద్యా ఉపాసకులే చేస్తారు,సాధారణ పద్దతిలో ప్రతి ఒక్కరు ఈ తల్లిని పూజించ వచ్చు.

శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం (వారాహి దేవి):

(వింధ్యాచలము పైన సాక్షాత్తు ఆ కాశి విశ్వనాథ స్వామి శ్రీ వారాహి అమ్మవారిని ప్రతిష్టించారు ఆ అమ్మవారిని ఇక్కడి వారు విన్ధ్యేశ్వరిగా కొలుస్తారు ఈ అమ్మవారికి వింధ్యాచల్ లో వామాచారం లో కొలుస్తారు ఈ మందిరం లో కాళీ అమ్మవారు కూడా ప్రతిష్టింపబడింది)

నిశుంభ-శుంభ మర్దిని ప్రచండ ముండ ఖండినీం

వనే రణే ప్రకాశినీం భజామి వింధ్య వాసినీం  1 ..

త్రిశూల ముండ ధారిణీం ధరా విఘాత హారిణీం

గృహే గృహే నివాసినీం భజామి వింధ్య వాసినీం  2 ..

దరిద్ర దుఃఖ హరిణీం సదా విభూతి కారిణీమ్

వియోగ శోక హరిణీం భజామి వింధ్య వాసినీం 3..

లసత్సులోల లోచనం లతాసదే వరప్రదం

కపాల శూల ధారిణీం భజామి వింధ్య వాసినీం  4..

కరేముదా గదాధరీం శివమ్ శివ ప్రదాయినీమ్

వరం వరాననం శుభం భజామి వింధ్

య వాసినీం  5..

ఋషీంద్రయామినీ ప్రదం త్రిదా స్వరూపధారిణీం

జలే స్థలే నివాసినీం భజామి వింధ్య వాసినీం  6..

విశిష్ట సృష్టి కారిణీమ్ విశాల రూప ధారిణీం

మహోదరే విలాసినీమ్ భజామి వింధ్య వాసినీం  7..

పురంధరాది సేవితం మురాది వంశ ఖండినీమ్

విశుద్ధ బుద్ది కారిణీమ్ భజామి వింధ్య వాసినీం  8.

అమ్మవారి అనుగ్రహం పొందే స్త్రోత్రం ఇది. ప్రతి రోజు పారాయన స్త్రోత్రం గా చేస్తే అన్ని శుభాలను కలిగిస్తుంది.తరచూ అనారోగ్యంతో ఉండే వాళ్ళు అష్టోత్తరం తో అర్చన చేస్తే మంచిది, ఈమె ఆయుష్షు ని వృద్ధి చేస్తుంది, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది, ఈమె రథంలో ఎప్పుడూ ధన్వంతరి (వైద్యుడు)ఉంటారుఅంతటి కారుణ్య స్వరూపిణి ఈ తల్లి. బ్రహ్మాండ పురాణంలో దేవతలు ఈ తల్లిని 12 నామాలతో కీర్తించారు. ఆ నామాలు స్మరణచేతనే వజ్రకవచంలా అమ్మ యెక్క రక్షణ వలయం మన చుట్టుా ఏర్పడిందని ప్రతీతి...

12 నామాలకు సంభవించిన శ్లోకం:

పంచమీ, దండనాధా చ సంకేతా, సమయేశ్వరీ! 

సమయసంకేతా, వారాహీ, హోత్రిణీ, శివా!

వార్తాళీ చ మహాసేనా, ఆజ్ఞాచక్రేశ్వరీ తథా!

అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే!

నామ ద్వాదశకాభిఖ్య వజ్ర పంజర మధ్యగః!

సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః!!

12 నామాలు:

పంచమి.  దండనాధ.  సంకేతా.  సమయేశ్వరీ.  సమయ సంకేతా.  వారాహీ.  హోత్రిణీ.  శివా.  వార్తాళీ. మహా సేనా.  ఆజ్ఞాచక్రేశ్వరీ.  అరిఘ్నీ

అందరం భక్తి శ్రద్ధలతో " ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః " నామం వ్రాస్తూ అమ్మవారిని స్మరిద్దాం ... మనం ఎంతగా తలచుకుంటే అంతగా అనుగ్రహిస్తుంది ఆ జగన్మాత ---- ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః ----

ఆ అమ్మ దయ మనందరిపైనా ఎప్పుడుా ఉండాలని కోరుకుంటూ!..... అమ్మ అందరిదీ- అమ్మ అందరికీ!... 

"సర్వేజనాః సుఖినోభవంతు! "

 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...