Tokyo state of emergency

Sports

views 62

Jul 7th,2021

ఈనెల23వ తేదీ నుంచి జపాన్‌ రాజధానిలో గేమ్స్‌ మొదలవుతాయి . టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభానికి ఇంకా15 రోజులే ఉంది. టోక్యోలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో 920 కొత్త కేసులు వచ్చాయి. మే తర్వాత ఇవే హయ్యెస్ట్‌ కావడంతో జపాన్‌ ప్రభుత్వం, టోక్యో ఆర్గనైజర్స్‌ కంగారు పడుతున్నారు. మెగా ఈవెంట్‌ కోసం ఇండియా నుంచి బయలుదేరనున్న అథ్లెట్లు మాత్రం..తాము టోక్యో ఎప్పుడు వెళతామో తెలియక కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. ఒలింపిక్స్‌కు సెలెక్ట్‌ అయిన అథ్లెట్లలో ఫస్ట్‌ బ్యాచ్‌ 17వ తేదీన టోక్యో బయలుదేరుతుందని ఐఓఏ ప్రెసిడెంట్‌ నరీందర్‌ బాత్రా మూడు రోజుల క్రితం ప్రకటించారు.కానీ , టోక్యో ఒలింపిక్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ నుంచి క్లియరెన్స్‌ వస్తే 14వ తేదీనే ప్రయాణముంటుందని ఐఓఏ నుంచి అథ్లెట్లకు ఇటీవల మెసేజ్‌ వచ్చింది. '14వ తేదీన బయలుదేరాల్సి ఉంటుందని తొలుత మాకు చెప్పారు. కానీ ఇప్పుడు వెయిట్‌ చేయమంటున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు' అని టోక్యో జర్నీపై ఓ టాప్‌ షట్లర్‌ పేర్కొన్నారు. అయితే, 17వ తేదీన తొలి బ్యాచ్‌ స్టార్ట్‌ అవుతుందని ఐఓఏకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. జపాన్ ప్రధాని యొషిహిడె సుగా..కీలక మంత్రులతో మీటింగ్​ఏర్పాటు చేశారు. టోక్యోలో మళ్లీ వైరస్​ఎమర్జెన్సీ పెట్టడంపై గురువారం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...