TTD Wedding Gift For Newly Married Couples

Devotional

views 29

Jul 7th,2021

ఎలాంటి విఘ్నాలు లేకుండా కార్యం జరిగిపోవాలని వినాయకుడిని మొదట పూజించి పనులు మొదలు పెడతారు. పెళ్లి వేడుక సమయంలో దేవుళ్లను పూజించడం తెలుగువారి సంప్రదాయం.శుభలేఖ దగ్గర్నుంచి ప్రతి వస్తువును ముందుగా దేవుడి ముందు పెట్టి ఆ తర్వాతే బంధువులకు, స్నేహితులకు ఇస్తారు.తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ తొలి ఆహ్వాన పత్రిక పంపాలని చాలామంది కోరుకుంటారు.తిరుపతికి దగ్గరలో ఉన్నవారికి ఎలాంటి సమస్యలు లేవు కాని దూరంగా ఉన్న వారికి తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది.ఇంట్లో పెళ్లి నిశ్చయం కాగానే మొదటి శుభలేఖను నెల ముందుగానే తిరుమలకు పంపొచ్చు. వెంటనే తిరుమల నుంచి విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులకు చేతి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్లి జరిగే రోజు తలంబ్రాల్లో కలుపుతారు) వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు. తిరుమల శ్రీవారి నుంచి పెళ్లి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇందుకోసం 'శ్రీ లార్డ్‌ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి' చిరునామాకు మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక కొరియర్‌ చేయొచ్చు. కరోనా వేళలోనూ నూతన వధూవరులకు టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని గతంలోనూ టీటీడీ అందించింది.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...