Cancer Risk With Sunlight

ఎండ ఎక్కువగా తగలకపోవడం వల్ల చాలామందికి పెద్దపేగు, మలద్వార క్యాన్సర్ వస్తోందని కాలిఫోర్నియా శాన్‌డియాగో పరిశోధకులు చెబుతున్నారు.శరీరంపై ఎండ పడితేనే డీ విటమిన్ సప్లిమెంట్లు అందుతాయనే విషయం తెలిసిందే. ఇమ్యెునిటీకి సహాయంగా ఉండే డీ విటమిన్ ఉత్పత్తికి కారణం అతినీలలోహిత కిరణాలు.యాంత్రిక జీవనంలో ఎండ పడడం కూడా కష్టం అవుతోంది. 2017, 2018 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 186 దేశాల్లో పెద్దపేగు-మలద్వార క్యాన్సర్ ఉద్ధృతికి కారణంపై అతినీల లోహిత కిరణాల స్థాయిని పరిశీలించి అధ్యయనం చేశారు. 45 ఏళ్లు పైబడ్డవారిలో యూవీబీ కిరణాలు లోపించడానికి, క్యాన్సర్ ముప్పు పెరిగేందుకు దగ్గరి సంబంధం ఉన్నట్లుగా గుర్తించామని ఈ పరిశోధనఅ ద్వారా స్పష్టంచేశారు.అలాగే సూర్యతాపం, ఓజోన్ స్థాయి, ప్రజల ఆహారవ్యవహారాలు, పొగతాగుట, సగటు ఆయుఃప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని, అతి నీల లోహిత కిరణాలు తక్కువగా ఉండే నార్వే, డెన్మార్క్, కెనడా తదితర దేశాలతో పాటు, అతిగా ఎండలు కాసే సూడాన్, నైజీరియా, ఇండియా, యూఏఈ దేశాలను 148 దేశాల్లో పోల్చి చుసిన తర్వాత ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే, విటమిన్ డి పుష్కలంగా దొరికితే మాత్రం క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చునని స్పష్టంచేశారు.
Comments
Post Your Comment
Public Comments: