Telangana Websites Won't Be Accessible For 2 Days

ఈ నెల 9వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11న రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రభుత్వ వెబ్‌సైట్లకు అంతరాయం కలగనుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనంలోని రాష్ట్ర డేటా కేంద్రం (SDC)లో కొత్త యూపీఎస్ యూనిట్ ఏర్పాటు దృష్ట్యా ఆ రెండు రోజులు ప్రభుత్వపరమైన ఆన్‌లైన్ సేవలు నిలిచిపోనున్నాయి. డేటా కేంద్రం ద్వారా ప్రస్తుతం ప్రభుత్వ వెబ్‌సైట్ల ఆన్‌లైన్ సేవలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఈ సేవలు పెరుగుతుండగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న యూపీఎస్(అన్‌ఇంటరప్టబుల్ పవర్ సప్లై) యూనిట్ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో స్థాయిని పెంచాలని నిపుణులు సిఫార్సు చేశారు. దీనికి అనుగుణంగా కొత్త యూపీఎస్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Post Your Comment
Public Comments: