Monsoon Healthy Food : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారపదార్థాలు....

Health

views 24

Jul 3rd,2021

వర్షాకాలంలో అనేక రకాల సీజనల్ వ్యాధులు దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. జ్వరం, ఇన్ఫెక్షన్ల భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారితో పోరాడేందుకు అలాగే ఇతర అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం రోగ నిరోధక శక్తి తప్పనిసరి. ఇన్ఫెక్షన్లకు గురయ్యే ఛాన్స్ కి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వర్షాకాలంలో గురయ్యే ఛాన్స్ ఉంటుంది.రోజు తీసుకునే ఆహార పదార్థాలలో కొన్ని ముఖ్యమైనవి మీకోసం.

 

పుట్టగొడుగులు..

ఇందులో ఫైబర్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా.. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు.. వీటిని రోజూవారీ డైట్ లో చేర్చుకోవడం మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా#8230; క్యాన్సర్, గుండె జబ్బును తగ్గిస్తుంది.

పుచ్చకాయ..
సాధారణంగా పుచ్చకాయ ఎండాకాలంలో ఎక్కువగా విరివిగా దొరుకుతుంది. ఇది ఎక్కువగా తీసుకోవడం వలన హైడ్రేటింగ్ గా ఉండేలా చేస్తుంది. ఇందులో గ్లూటాతియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

బ్రోకలీ..
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బ్రోకలీలో సల్ఫోరాఫేన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అలాగే ఐరన్ లోపాన్ని కూడా తగ్గిస్తుంది. దీనిని రోజూవారీ డైట్ లో తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

బచ్చలి కూర..
ఇందులో విటమిన్ సి, ఇ ఎక్కువగా ఉండడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక రకాల పోషకాలు నిండి ఉండడం వలన బచ్చలి కూరను ఎక్కువగా తీసుకోవడం వలన సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

బీట్‏రూట్..
సాధారణంగా బీట్‏రూట్ శరీరంలో రక్తాన్ని పెంచుతుందని అంటుంటారు. కేవలం హిమోగ్లోబిన్ పెంచడమే కాదండోయ్.. బీట్‏రూట్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో పొటాషియం, ఇతర ఖనిజాల వంటి పోషకాలు అనేకం. ఇది రక్తపోటును తగ్గించడమే కాదు.. ఆరోగ్యమైన బరువును నిర్వహిస్తుంది. అంతేకాదు.. క్యాన్సర్ వ్యాధిని నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. దీనిని రోజూ తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతంది.

నారింజ..
ఇది ఎక్కుగా ఆమ్లత్వం కలిగి పదార్థం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఐరన్ లోపం.. రక్తహీనతతో బాధపడేవారికి ఇది సూపర్ బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు.

పెరుగు..
పెరుగు రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ప్రోబయోటిక్స్ జలుబు తీవ్రతను తగ్గిస్తుంది. ఇందులో ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...