Covaxin Effective Against Delta Variant : డెల్టా వేరియంట్‌పై కొవాగ్జిన్ ఉక్కు పాదం...

Health

views 20

Jul 3rd,2021

భారత్ బయోటెక్ కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. 77.8 శాతం సమర్థతతో కరోనా వైరస్‌పై పనిచేస్తున్నట్టు కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో 93.4 శాతం, డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ప్రభావం చూపుతున్నట్టు భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు.రోనా సంక్రమణ కారణంగా తలెత్తే తీవ్ర లక్షణాలను కొవాగ్జిన్ అడ్డుకుంటుందని, ఫలితంగా ఆసుపత్రిలో చేరే అవసరాన్ని తగ్గిస్తుందని ఆయన వివరించారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను దేశవ్యాప్తంగా 18 నుంచి 98 ఏళ్లలోపు వ్యక్తులపై 25 ప్రాంతాల్లో నిర్వహించారు. రెండో డోస్ ఇచ్చిన రెండు వారాల తర్వాత కోవిడ్ లక్షణాలున్న 130 కేసులను పరిశీలించి విశ్లేషించారు. లైసెన్స్ లేని SARS-CoV-2 వ్యాక్సిన్ లక్షణాలు బయటపడని వ్యక్తులపై కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని, కోవిడ్ వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుందని కంపెనీ సూచించింది. 'శాస్త్రీయ విశ్వాసం, సామర్థ్యం, నిబద్ధతతో భారతదేశాన్ని ప్రపంచ పటంలో చేర్చడం మాకు గర్వకారణం.వ్యాక్సిన్ సమూహంలో 24, ప్లేసిబో సమూహంలో 106 మొత్తం 130 కేసులను విశ్లేషించగా తాము అభివృద్ధి చేసిన కొవ్జాగిన్.. కోవిడ్‌పై 77.8 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తేలింది ' అని భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్ల ట్వీట్ చేశారు. టీకా తీసుకున్నవారిలో పన్నెండు శాతం మందికి సాధారణ దుష్ప్రభావాలు తలెత్తాయి.. 0.5 శాతం కంటే తక్కువ మందికి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యాయి.. ఐసీఎంఆర్, ఎన్ఐవీ భాగస్వామ్యంతో ఈ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. కొవాగ్జిన్ భద్రత వ్యాక్సిన్ అభివృద్ధిలో వినియోగించిన టెక్నాలజీ ఆధారంగా స్థిరపడింది. భారత్ బయోటెక్ వెరో సెల్ విభాగానికి భద్రతలో 20 ఏళ్ల ట్రాక్ రికార్డ్ ఉంది. అంతేకాకుండా భారత్ బయోటెక్ ఇప్పటి వరకు కొవాగ్జిన్ కోసం ప్రభుత్వాల నుంచి నష్టపరిహారాన్ని కోరలేదు.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...