Covid Vaccine No Impact on Fertility : సంతోనాత్పత్తిపై కొవిడ్ వ్యాక్సిన్‌ ఎలాంటి ప్రభావం ఉండదు..

Health

views 19

Jul 3rd,2021

కరోనా నుంచి రక్షణ కోసం ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్లపై అనేక సందేహాలు, అపోహలు వ్యాక్సిన్ తీసుకుంటే ఏమౌతుందననే ఆందోళన వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మహిళలు, పురుషుల్లో సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని అపోహలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కొత్త పరిశోధనల ప్రకారం.. కరోనావైరస్ వ్యాక్సిన్ మగ లేదా ఆడ సంతానోత్పత్తిపై ఎటువంటి ప్రభావాన్ని చూపదని తేలింది. టెల్ హాషోమర్‌(Tel Hashomer)లోని షెబా మెడికల్ సెంటర్‌లోని ప్రసూతి, గైనకాలజీ విభాగానికి చెందిన పరిశోధక బృందం 36 జంటలపై అధ్యయనం చేసింది. ఫైజర్ టీకాకు ముందే వారంతా సంతానోత్పత్తి చికిత్సలు (fertility treatments) చేయించుకోలేదు. టీకా తర్వాత మరోసారి చికిత్స చేసుకునేందుకు వెళ్లారు. టీకాకు ముందు ఆ తర్వాత వారిలో ఎలాంటి మార్పులు వచ్చాయో పరిశోధకులు పోల్చి చూశారు. టీకా తీసుకున్నవారిలో అండాశయ నిల్వ(ovarian reserve)పై ప్రభావం లేదని కనుగొన్నారు.

సంతానోత్పత్తిపై వ్యాక్సిన్ల వల్ల కలిగే ప్రభావాలపై అనేకమంది భయపడుతున్న నేపథ్యంలో తాము ఈ పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నామని Sheba's IVF Fertility Clinic డైరెక్టర్, ప్రొఫెసర్ Raoul Orvieto అన్నారు. టీకాతో మగ లేదా ఆడ సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపదని తమ పరిశోధనలో తేలిందని ఆయన చెప్పారు. రెండవ (IVF cycle) ఫలితంగా 30శాతం జంటలు గర్భం దాల్చారు. సగటు కంటే చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. సాధారణంగా, వృద్ధ వయస్సు వారిలో సంతానోత్పత్తి సక్సెస్ రేటు 25శాతంగా ఉందని.. టీకా సురక్షితమేనని వెల్లడించారు. టీకాలపై ఇప్పుడిప్పుడే ఎక్కువ మందికి నమ్మకం కలుగుతుందని చెప్పారు. కరోనావైరస్ వ్యాప్తితో అండాశయ పనితీరు లేదా వీర్య నాణ్యత (sperm concentration)ను తగ్గించడం ద్వారా సంతానోత్పత్తిని (damage fertility) దెబ్బతీస్తుందని కొన్ని ప్రాథమిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. మయామి యూనివర్శిటీ (University of Miami) నుంచి ఇటీవల జామా జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం పురుష సంతానోత్పత్తి (male fertility)పై వ్యాక్సిన్ ప్రభావాన్ని పరిశీలించగా ప్రభావం లేదని తేలింది.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...