Pawan kalyan New Movie : నెట్టింట వైరల్ అవుతోన్న కొత్త టైటిల్....

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన వకీల్‌సాబ్ బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ రేంజ్ , స్టామినా ఏంటో తెలిపింది . తాజాగా పవన్ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే పవన్ కొత్త చిత్రం టైటిల్ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా తెలుగు రీమేక్‌లో పవన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు పరుశురామ కృష్ణమూర్తి అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధకారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Comments
Post Your Comment
Public Comments: