Steve Smith Words On Ben Stokes

Sports

views 18

Aug 1st,2020

సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ -2020 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం అభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య  మాజీ, ప్రస్తుత ప్రపంచ దేశాల క్రికెటర్లందరూ స్టోక్స్‌ని అద్భుతమైన ఆటగాడని, నెంబర్ వన్ ఆల్‌రౌండర్ అని తెగ పొగిడి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఐతే ప్రస్తుతం ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ కూడా చేరాడు. స్టోక్స్ వంటి ఆటగాళ్లు ఉంటే జట్టు పటిష్ఠంగా ఉంటుందని, అతడు తన జట్టులో ఉండటం ఎంతో ఆనందంగా ఉందని ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండడంతో పలువురు క్రికెటర్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్మిత్ స్టోక్స్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 'బెన్ స్టోక్స్ గొప్ప ఆల్‌రౌండర్ అని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు విభాగాల్లోనూ అతడు రాణించగలడని  జట్టు ఎంత క్లిష్ట పరిస్థితులలో ఉన్నా స్టోక్స్ వంటి ఆటగాళ్లు పోరాడి గెలిపించగలరు అని చెప్పారు. అంతే కాకుండా ప్రపంచ కప్‌-2019లో అద్భుతంగా ఆడి ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడని. ఇటీవల విండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ గొప్ప ప్రదర్శన చేశాడు. స్టోక్స్ తన ప్రతిభను అంతకంతకూ పెంచుకుంటున్నాడు. అందుకే అలాంటి ఆల్‌రౌండర్లు జట్టులో ఉండటం చాలా ముఖ్యమ'ని స్మిత్ పేర్కొన్నాడు.

 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...