US says unlikely to use China, Russia COVID-19 Vaccine

చైనా, రష్యా రూపొందిస్తున్న కొవిడ్-19 టీకాలను కొనుగోలు చేసేందుకు అమెరికా సుముఖంగా లేదని విశ్వసనీయ సమాచారం. క్లినికల్ ట్రయల్స్ జరపకుండా వ్యాక్సిన్లు ముందుగానే మార్కెట్లో విడుదల చేస్తే అవి సురక్షితమో కాదో తెలియదని పైగా అవి మరీ ప్రమాదమని భావిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం దశాబ్దాల వరకు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ టెడ్రోస్ మీడియాతో కరోనా వైరస్ మహమ్మారిగా ప్రకటించి ఆరు నెలలు కావడంతో మాట్లాడిన సంగతి తెలిసిందే. అమెరికా అంటు వ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోని ఫౌచి పారదర్శకంగా లేని ఔషధ నియంత్రణ సంస్థలున్న దేశాల టీకాలను తాము వాడటం కష్టమేనని అన్నారు. క్లినికల్ ట్రయల్స్ జరపకుండా వ్యాక్సిన్లను వాడితే వచ్చే సమస్య కచ్చితంగా మరింత జటిలం అవుతుంది' అని ఫౌచి మీడియా సమావేశంలో అన్నారు. కాగా సొంతంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఫార్మా దిగ్గజాలు సనోఫి, గ్లాక్సోస్మిత్‌కెలైన్ కు 2.1బిలియన్ డాలర్లు చెల్లించిన సంగతి తెలిసిందే.
Comments
Post Your Comment
Public Comments: