WHO Shocking News On Coronavirus

కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా వున్నా సమయంలో WHO మరో బయంకరమైన విషయాన్నీ బయటపెట్టింది.కరోనా వైరస్ పై ప్రపంచదేశాలకు మరోసారి హెచ్చరికలు జారీ చేస్తూ వైరస్ ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ టెడ్రోస్ తెలిపారు. వైరస్ వెలుగులోకి వచ్చి ఆరు నెలలు అయిన సందర్భంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడకం, సామూహిక ప్రదేశాలు మూసివేయడం వంటి చర్యలను ప్రపంచదేశాలు కొనసాగించాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ఇంకా చాలామందికి వైరస్ ముప్పు ఉందని.. ఇప్పటికే సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో మరోసారి విజృంభించే అవకాశం ఉందని బాంబు పేల్చింది. శతాబ్దానికి ఒకసారి వెలుగులోకి వచ్చే ఇలాంటి మహామ్మారుల ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ వెల్లడించారు.
Comments
Post Your Comment
Public Comments: