5 PLA soldiers killed 11 injured in Galwan Valley clash with Indian Army - reports Chinese media

National

views 32

Jun 16th,2020

భారత్-చైనా సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు చైనా సైనికులు మరణించారని, 11 మంది గాయపడ్డారని చైనా మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ ఛీఫ్ రిపోర్టర్ ఒకరు ట్వీట్ చేశారు. అయితే, మరణాల సంఖ్యను ఏ అధికారిక వెబ్‌సైట్‌లో చైనా ప్రభుత్వం పేర్కొలేదని ప్రస్తావించారు. ఈ ఘర్షణలో ఇరువైపులా ప్రాణనష్టం జరిగిందని భారత ఆర్మీ కూడా వెల్లడించింది. భారత్ వైపు ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇరు దేశాలు బలగాలను ఉపహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. కాగా, ప్రస్తుత పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఇరువర్గాలకు చెందిన ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.

 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...