Second Wave Of Coronavirus

దేశంలో ఇప్పటికే లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అన్ని రాష్ట్రాల్లో రోజూ పాజిటివ్ ల సంఖ్య సరికొత్త రికార్డులను నమోదు నమోదు అవుతున్నాయి. ఐతే ఇప్పుడు ప్రజల్లో ఇంకొ బయన్ని కలిగించే విషయం రెండోసారి కరోనా బారిన పడడానికి గల కారణాలను తాజాగా వైద్య నిపుణులు వివరించారు. ఒకసారి వైరస్ బారినపడి కోలుకున్నా.. శరీరంలో మిగిలి ఉన్న మృత వైరస్ ల కారణంగానే మళ్ళీ పాజిటివ్ వస్తోందని వెల్లడించారు. అయితే రెండోసారి కరోనా వచ్చిన వారిలో ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదని అలాంటి వారి నుండి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందదని చెబుతున్నారు. క్లినికల్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ జర్నల్' నివేదికలో వైద్య నిపుణులు ఈ వివరాలు వెల్లడించారు. కరోనా బారిన పడినవారికి వైద్యులు మంచి పౌష్టికాహారం అందించడంతో పాటు విటమిన్ సీ డీ లతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. వైరస్ బారిన పడ్డవారు సగటున 14 రోజులకు కోలుకుంటున్నారు. వారిలో 20 రోజుల తర్వాత యాంటీబాడీలు తగిన సంఖ్యలో ఉత్పత్తి అయిన తరువాత శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి బాధితులు క్రమేణా ఆరోగ్యవంతులుగా తయారవుతారు. బాధితులకు రెండు నెలల తర్వాత శరీరంలో యాంటీబాడీల సంఖ్య మళ్ళీ తగ్గిపోతున్న క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించక పోతే మళ్ళీ కరోనా బారిన పడే అవకాశం ఉంది. దీనిపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్- ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ మాట్లాడుతూ మొదటిసారి తీవ్ర లక్షణాలతో బాధపడ్డ వారు రెండోసారి కరోనా బారినపడ్డా.. వారికి దగ్గు జలుబు జ్వరం ఊపిరి తీసుకోవడంలో సమస్యలు వంటి లక్షణాలు కనిపించడం లేదని తెలిపారు. రెండోసారి వైరస్ పడ్డవారికి తీవ్ర లక్షణాలు ఇప్పటివరకు కనిపించలేదని ఆయన వెల్లడించారు. రెండోసారి కరోనా బారిన పడ్డ వారి నుంచి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందదనే విషయం కొంచం ఊపిరి పీల్చుకునేలా ఉంది.
Comments
Post Your Comment
Public Comments: